ఏకం విశ్వశాంతి ఉత్సవాలకు స్వాగతం

సెప్టెంబర్ 12 నుండి 2019 సెప్టెంబర్ 22 వరకు

ఏకం విశ్వశాంతి ఉత్సవాలు ఒక శాంతి కార్యక్రమం కాదు. ఇది చైతన్యం లో శాంతి కొరకు జరిగే ప్రయాణం. ఏకం విశ్వశాంతి ఉత్సవాలు హింసను వ్యతిరేకించి చేసే యుద్ధం కాదు, ఇది ప్రతిఒక్క వ్యక్తి, సంఘర్షణ మరియు విభజన నుండి అంతరంగ ప్రశాంతత వైపుకు చేసే ప్రయాణం. ఏకం విశ్వశాంతి ఉత్సవాలు ఎదుటి వ్యక్తిని లేద సమాజాన్ని మార్చడానికి కాదు, ఇది వ్యక్తిగత పరివర్తన యొక్క ప్రయాణం. ప్రశాంతత తో నిండిన మనిషి అమె/అతను వారి కుటుంబానికి ఒక బహుమతి, ప్రపంచంలో మంచితనం నెలకొల్పడానికి ఒక శక్తివంతమైన ప్రేరణ.

ధ్యేయం
Watch Video
విశ్వశాంతికి మీరు అందించే సహకారం

మీరు శాంతి చైతన్యానికి జాగృతం అయినప్పుడు మీ దగ్గర బాంధవ్యాలు కుశలంగా వుండేలా చేయగల శక్తి మీకు కలుగుతుంది. మీరు ప్రేమ నిండిన తల్లిదండ్రులుగా, అనుసంధానం కలిగిన జీవిత భాగస్వామిగా, మీ తల్లిదండ్రులకు కరుణ మరియు అర్థం చేసుకునే బిడ్డగా అయిపోతారు. మీ ప్రియమైన బాంధవ్యాలలో ఈ అన్ని భాగాలలో మీరు జాగృతం అవుతారు.

ఒక శాంతియుత నాయకుడిగా, ఒక శాంతియుత వ్యాపారవేత్తగా, మీ వృత్తిలో మీతో పాటు పని చేసే ప్రతి ఒక్కరికి, మీ టీమ్ మెంబర్లలో, సహచరులలో, తోటి ఉద్యోగుల హృదయాలలో కలసి మెలసి జీవించగలిగే సంస్కృతిని పెంపొందించగలిగే ఒక శాంతియుత సంఘ కార్యకర్తగా అయిపోతారు.

మీరు భాగం పంచుకునే వర్గాలలో మరియు సమాజంలో ఒక బాధ్యతాయుతమైన అక్కర నిండిన పౌరులుగా మరియు మీ జీవిత పరిధిలో మీరు ఎంతోమందిని పరివర్తింప చేసి మరియు ప్రభావితం చేసి వారిలో శాంతిని నెలకొల్పుతారు. ఆఖరిగా తపన నిండిన శాంతి కామకులుగా ప్రపంచ చైతన్యాన్ని ప్రభావితం చేసే అందమైన భూతలానికి దోహదం చేస్తారు.

విశ్వ శాంతి పై ఏకం ప్రభావం.

ఏకం దైవీక శక్తి క్షేత్రం. వాస్తు శిల్ప కళా నైపుణ్య శాస్త్రంతో పురాతన పవిత్ర గణితశాస్త్ర ఆధారంగా దీనిని నిర్మించబడినది. ఈ స్థలం చాలా విశేషమైనది. ఏకం మానవాళిని ఉన్నత ముక్తి చైతన్య స్థితిలులోకి తీసుకుని వెళ్ళడానికి మరియు ప్రపంచంలో పరివర్తన త్వరితగతిన తీసుకుని రావడానికి పవిత్రమైన సంకల్పంతో నిర్మించబడిన శక్తి క్షేత్రం. ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం, ఇందులో అడుగు పెట్టిన ప్రతీ ఒక్కరూ విశ్వ చైతన్యం లేద విశ్వ ప్రజ్ఞతో చాలా సులువుగా అనుసంధానం అవుతారు. ఇక్కడ ధ్యానం ఒక సంభవం. ఉన్నత చైతన్య స్థితిలు మరియు ముక్తి సహజ సంభవాలు.

కొన్ని వేల మంది సాధకులు ఏకం గర్భగృహంలో కూర్చుని ధ్యానం చేసినప్పుడు వారి చైతన్యంలో కలిగే పరివర్తన రెట్టింపు అయ్యి అది మానవాళి చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా వివిధ పీస్ ఎనర్జీ పాయింట్ లోని సాధకులు, ఏకంతో అనుసంధానం అయ్యి ఉన్న ప్రతిఒక్కరూ వారి చైతన్యంలో మహత్తరమైన మార్పును అనుభవిస్తారు. ఈ విధంగా శ్రీ ప్రీతాజీ మరియు శ్రీ కృష్ణాజీ యెక్క ధ్యేయం విశ్వ శాంతి కొరకు సిద్దింపబడుతుంది. ఈ విధంగా ప్రపంచంలో గొప్పకరుణ, గొప్ప సామరస్యం మరియు గొప్ప క్రమం నెలకొంటుంది.

ఏకం విశ్వశాంతి ఉత్సవాల సమయంలో ఏకం లో ఏమి జరుగుతుంది.

సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 22,2019 వరకు.

వ్యక్తిగత చైతన్యం మరియు ప్రపంచ చైతన్యం వేరు వేరు కాదు. వ్యక్తికి ఏమి జరుగుతుందో అది ప్రపంచానికి జరుగుతుంది, ప్రపంచానికి ఏమి జరుగుతుందో అది వ్యక్తికి జరుగుతుంది. ప్రపంచం మరియు వ్యక్తి చైతన్యంలో వేరు కాదు.

 

ఏకం విశ్వశాంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ప్రత్యేకమైన దీక్షలు మరియు ప్రక్రియలు రోజూ జరిగే సిద్దిలు మరియు ఉపాసనలతో పాటు నిర్వహించబడుతాయి. వీటిని దశ శాంతి సిద్దిలు అంటాము. దశ శాంతి సిద్దిలు చాలా ప్రత్యేకమైన ప్రక్రియలు. ప్రపంచంలోని అసమానతలు తొలగించడానికి ఒకొక్కరోజు ఒకొక్క ప్రత్యేకమైన సంకల్పానికి అంకితం చేస్తాము. తీసుకున్న ప్రతి సంకల్పానికి సాధకులు వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందుతారు.

దశ శాంతి సిద్దిలు

సెప్టెంబర్ 12న
శాంతి ధ్యానం: ప్రపంచంలోని అన్ని యుద్ధాలు అంతమొందించడం కొరకు
మీరు పొందే దీవెన మీ చైతన్యంలో సంఘర్షణ మరియు యుద్ధం అంతమొందించడం కొరకు.
సెప్టెంబర్ 13న
శాంతి ధ్యానం: ప్రకృతి వైపరీత్యాలు శాంతించడం కొరకు
మీరు పొందే దీవెన మీ గృహంలో మంగళకరమైన ప్రాణశక్తి ప్రవహించడం కొరకు.
సెప్టెంబర్ 14న
శాంతి ధ్యానం: స్రీల పట్ల అఘాయిత్యం అంతమొందించడం కొరకు
మీరు పొందే దీవెన మీ కుటుంబంలోని స్రీల మనఃశాంతి కొరకు
సెప్టెంబర్ 15న
శాంతి ద్యానం: చిన్న పిల్లలపై హింసను నివారించడానికి
మీరు పొందే దీవెన మీ పిల్లలు మరియు భావితరాలకు శాంతి కలగడం కొరకు
సెప్టెంబర్ 16న
శాంతిధ్యాన: ప్రపంచంలోని మతపరమైన అసమానతలు తొలగించడానికి
మీరు పొందే దీవెన మీ దైవంతో అనుభందం ధృఢమవ్వడం కొరకు
సెప్టెంబర్ 17న
శాంతి ధ్యానం: జాతి వివక్షతను నిలిపివేయడం కొరకు
మీరు పొందే దీవెన మీ సమాజంలో గౌరవం మరియు ఆదరణ పొందడం కొరకు.
సెప్టెంబర్ 18న
శాంతిధ్యానం: జంతువుల పట్ల క్రూరత్వం అంతమొందించడం కొరకు
మీరు పొందే దీవెన మీలో కారుణ్యం జాగృతం అవ్వడం కొరకు
సెప్టెంబర్ 19న
శాంతి ధ్యానం: గృహహింస నివారణకు
మీరు పొందే దీవెన మీ కుటుంబం శాంతియుతంగా జీవించడం కొరకు.
సెప్టెంబర్ 20న
శాంతి ధ్యానం: యువత మనసులలో హింస మరియు ఉద్రేకాన్ని నివారించడానికి
మీరు పొందే దీవెన మీ జీవితం లో ఉన్న యువతీయువకులుకు అభివృద్ది మరియు శాంతియుత జీవనాన్ని జీవించడం కొరకు
సెప్టెంబర్ 21న
శాంతి ధ్యానం: ఆర్థిక దోపిడీ నిర్మూలనం కొరకు
మీరు పొందే దీవెన మీ జీవితం లో సుసంపదలు పొందడం కొరకు.
సెప్టెంబర్ 22న
ఈరోజు ఏకం ఉత్సవాలు తారాస్థాయికి చేరుకునే రోజు. ఈరోజు శాంతి ధ్యానం విశ్వ శాంతి కొరకు మరియు సమస్త మానవాళి శాంతియుత సామూహిక జీవితం కొరకు.

ఈరోజు ఏకం ఉత్సవాలు తారాస్థాయికి చేరుకునే రోజు. ఈరోజు శాంతి ధ్యానం విశ్వ శాంతి కొరకు మరియు సమస్త మానవాళి శాంతియుత సామూహిక జీవితం కొరకు.

విశ్వ శాంతికి దోహదం చేసే ఈ శక్తివంతమైన ప్రక్రియలలో భాగం పంచుకునేందుకు ఇదే మీకు మా ఆహ్వానం.

సమయ వివరాలు

ప్రపంచం నలుమూలల నుండి పీస్ మేకర్స్ ప్రతి రోజూ సాయంత్రం 6.30ని నుండి 7.30ని IST ఆన్లైన్ లో పాల్గొనవచ్చు.

ప్రతిరోజూ ఈ సమయంలో మీరు మాతో కలసి ధ్యానం చేస్తారు. చివరిరోజు మా అందరితో కలసి సంబరాల్లో పాల్గొంటారు.

ఏకం లో ఉండే పీస్ మేకర్స్ యొక్క సాధన ఉదయం పారంభమయ్యి ఏకం గర్భగృహంలో శాంతి ధ్యానంతో సంపూర్ణమవుతుంది.

మా కమ్యూనిటీ గురించి తెలుసుకోండి.

ఏకం వరల్డ్ పీస్ మేకర్ ప్రపంచం నలుమూలల నుండి శాంతిని నెలకొల్పే పవిత్ర ధ్యేయాన్ని చేపట్టిన ఒక ప్రదాన వ్యక్తుల సమూహం. కేవలం సరికొత్త చైతన్యంలో జీవించే పరివర్తన చెందిన వ్యక్తి మాత్రమే ఎదుటి వారితో అనుసంధానం అయ్యి సమస్త అభ్యుధయానికి దోహదపడతారని మా నమ్మకం.

ఏకం విశ్వశాంతి ఉత్సవాలు మీకు పీస్ మేకర్స్ గా ఉండే మహత్తరమైన అవకాశం అందిస్తుంది. తద్వారా మీరు మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసి ప్రపంచం యొక్క చైతన్యంలో పరివర్తనకు సహయపడుతారు. ప్రతి పీస్ మేకర్ కు ఒక పీస్ ఎనర్జీ పాయింట్ ని సృష్టించి కనీసం 23 మందితో కలసి సమావేశమై విశ్వ శాంతి కొరకు ధ్యానం చేసే అవకాశం కలదు.

0
ఏకం వరల్డ్ పీస్ మేకర్స్
0
ఏకం పీస్ ఎనర్జీ పాయింట్స్
0
ఏకం నందు పీస్ మేకర్స్

పీస్ మేకర్స్ అవ్వండి!

త్వరపడండి. ఈ అసాధారణమైన అవకాశం కొరకు మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.